మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

నీరవ్ మోదీ నన్ను కూడా ముంచేశారు: ప్రియాంక చోప్రా

Updated: 16-02-2018 09:13:05

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,346 కోట్ల మేర ముంచేసి విదేశాలకు చెక్కేసిన ఘరానా మోసగాడు నీరవ్ మోదీ... తనను కూడా ముంచేశారని బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన వజ్రాలకు తనను ప్రచారకర్త (అంబాసిడర్) గా నియమించుకున్నారని, అయితే అడ్వాన్స్ మాత్రమే చెల్లించి మిగతా మొత్తాన్ని ఇచ్చేందుకు నిరాకరించారని పేర్కొంది. తనకు రావాల్సిన మొత్తం కోసం కోర్టుకు వెళ్లనున్నట్టు ప్రియాంక తెలిపింది. ఇద్దరివీ ఒకే రకమైన ఆలోచనలు కావడం వల్లే పరిచయం ఏర్పడిందని పేర్కొంది. భారతీయ సంస్కృతిని ప్రపంచం ముందు ఉంచాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఆయనతో కలిసి పనిచేశానని ప్రియాంక పేర్కొంది. కాగా, నీరవ్ మోదీ తనను కూడా మోసం చేశారని బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా అన్నారు. ఆయనపై కేసు పెట్టాలనుకుంటున్నట్టు చెప్పాడు. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.