మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

బరువెక్కిన హృదయాలతో.. కన్నీటి ధారలతో..

Updated: 28-02-2018 10:25:42

ముంబై: ముంబై హృదయం బరువెక్కింది. అభిమానుల కన్నీటి జడిలో తడిసి ముద్దవుతోంది. అభిమాన తారను కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ముంబైలోని శ్రీదేవి ఇంటికి చేరుకుంటున్నారు. అభిమానుల రాకతో ముంబైలోని శ్రీదేవి నివాసమైన లోకండ్‌వాలా గ్రీన్ ఏకర్స్‌కు తరలివస్తున్నారు.
 
గతరాత్రి దుబాయ్ నుంచి ముంబై చేరుకున్న ఆమె మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఈ ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు తరలించారు. మధ్యాహ్నం రెండు గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుండగా 3:30 గంటలకు విలేపార్లే సేవా సమాజ్ హిందూ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.  
 
శ్రీదేవిని కడసారి చూసి నివాళులు అర్పించేందుకు దేశంలోని దాదాపు అన్ని చిత్రపరిశ్రమలకు చెందిన ప్రముఖులు ముంబై చేరుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్‌తో పాటు ఉత్తరాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే శ్రీదేవి ఇంటికి చేరుకున్నారు. రజనీకాంత్, కమలహాసన్, వెంకటేశ్, షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీఖాన్, దీపిక పదుకునే, రణ‌్‌వీర్ సింగ్, టబు, రేఖ, ఫరాఖాన్, జావెద్ అక్తర్, షబానా ఆజ్మీ, రాణిముఖర్జీ తదితరులు శ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. అభిమానులు వేలాదిగా తరలివస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించనున్నారు. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.