మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంచిన జైట్లీ

Updated: 01-02-2018 02:49:23

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జీతాలు పెంచారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల గౌరవ వేతనాలు పెంచారు. 
రాష్ట్రపతి వేతనం నెలకు రూ.5లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం నెలకు 4లక్షలు, గవర్నర్ల వేతనం నెలకు రూ.3.5లక్షల రూపాయలకు పెంచారు. ప్రతి ఐదేళ్లకొకసారి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వేతనాలపై సమీక్ష జరపాలని నిర్ణయించారు. అంతేకాదు ఎంపీల జీతాల పెంపుపై రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ఎంపీల జీతాలు కూడా భారీగా పెరగనున్నాయి. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.