మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన నిర్ణయం

Updated: 13-02-2018 11:30:37

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్ల వరకూ తాను ఎన్నికల బరిలో ఉండబోనని తెలిపారు. అయితే 2019 వరకూ మంత్రిగా కొనసాగుతానని చెప్పారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని అమిత్‌షాతో చెప్పానని, ఆయన అంగీకరించారని ఉమా భారతి తెలిపారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తాను బిజెపికి ప్రచారం చేస్తానన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అనారోగ్యం తనకు అడ్డంకిగా మారిందని చెప్పారు. మోకాళ్లకు సంబంధించిన ఇబ్బందితో తాను బాధపడుతున్నట్లు ఉమాభారతి చెప్పారు. వాస్తవానికి ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలో ఉమాభారతి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆమె రాజీనామాకు ఒప్పుకోలేదు. గంగా నది ప్రక్షాళన లక్ష్యంగా ఉమా భారతి పనిచేస్తున్నారు. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.