మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

నాగసూర్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఆయన తల్లి

Updated: 27-02-2018 11:56:26

హైదరాబాద్: హీరో నాగసూర్యకు ఆయన తల్లి, ఛలో నిర్మాత ఉషా ముల్పూరి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. పొర్సే 718 కేమాన్ కార్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత అదే కారు వద్ద నాగసూర్య తన తల్లితో కలిసి ఫొటో దిగి అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న విడుదలైన ఛలో సినిమా విజయవంతం కావడంతో ఆమె తన తనయుడికి ఈ కారును బహుమతిగా ఇచ్చారు. ఛలో సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. రష్మిక మందాన హీరోయిన్‌గా నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు హిట్ అయ్యాయి. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.