మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌పై చంద్రబాబు ఫైర్

Updated: 14-03-2018 07:02:10

అమరావతి: రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌పై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫైరయ్యారు. మిత్రపక్షం బీజేపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసి వైసీపీ ఎంపీని పిలిపించుకుని మాట్లాడడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఆయన వైఖరిని ఖండిస్తున్నట్టు చెప్పారు. రైల్వే జోన్ గురించి చర్చించేందుకు సమయం అడిగితే ఇచ్చి, తర్వాత ఖాళీ లేదని చెప్పిన మంత్రి ఆ తర్వాత వైసీపీ ఎంపీ వరప్రసాద్‌కు అపాయింట్‌మెంట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీకి మిత్రపక్షం వైసీపీనా? లేక టీడీపీనా అన్న సందేహాలను ప్రజల్లో కలిగిస్తన్నారని అన్నారు.  
 
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్రంపై దశలవారీగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలో ఏపీ సమస్యలు ప్రతిధ్వనించేలా పోరాడాలని అన్నారు. ఢిల్లీ వేదికగా పోరాటం సాగించడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చంద్రబాబు ఉందన్నారు 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.