మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

చిన్నారిని అనాథను చేసి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

Updated: 22-02-2018 02:58:09

బ్రాహ్మణపల్లి: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్టేషన్‌లో ఏడాది కుమార్తెను అనాథగా వదిలి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లభించిన ఆధార్ కార్డ్, ఫొటో ఐడెంటిటీ కార్డును బట్టి మృతులు కామారెడ్డి జిల్లా వాసులుగా తెలిసింది. సదాశివనగర్‌ మండలం పద్మాజివాడికి చెందిన ఒంటెద్దు కాశీరాం (27) గా గుర్తించారు.  ఆత్మహత్య చేసుకున్న దంపతుల మొబైల్‌ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.