మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య సంచలన ఆరోపణలు

Updated: 07-03-2018 02:06:38

ముంబై: క్రికెటర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. షమీపై అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించారు. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆమె ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బయటపెట్టారు. వాట్సప్, మెసేంజర్ సందేశాలను స్క్రీన్ షాట్లుగా తీసి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షమీస్ ఎంజాయ్ మెంట్ పేరుతో ఆమె ఫేస్‌బుక్ వాల్‌లో పోస్ట్ చేశారు. షమీ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని కూడా హసిన్ జహాన్ ఆరోపించారు. షమీతో పాటు ఆయన తల్లి, సోదరుడు కూడా తనను హింసిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనను చంపేస్తానని బెదిరించారని కూడా ఆమె ఆరోపించారు. షమీ బిఎండబ్ల్యూ కారులో కండోమ్‌లు దొరికాయని ఆమె ఆరోపించారు. గృహ హింస కేసు పెట్టే యోచనలో ఆమె ఉన్నారు. భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె మీడియాకు తెలిపారు.
 
ప్రస్తుతం ఆమె అకౌంట్ ఇన్ యాక్టివ్‌లో ఉంది. వాస్తవానికి హసిన్ జహాన్‌తో షమీ వివాహం 2014లో జరిగింది. అన్యోన్యంగా ఉండే జంటగా వీరికి పేరుంది. వీరి ఫొటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంటాయి. ఒక దశలో తన భార్య ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కొన్ని ఇస్లామిక్ సంస్థలు షమీని హెచ్చరించాయి కూడా. వీరికి ఐరా అనే మూడున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య విభేదాలు ఎలా వచ్చాయబ్బా అని అంతా తలలు పట్టుకుంటున్నారు.
 
వివాదంపై స్పందించిన షమీ ఇదంతా అబద్ధమని చెప్పారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన షమీ తన ప్రతిష్టకు భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. తనకు వివాహేతర సంబంధాలు లేవన్నారు. తన కెరీర్‌ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని షమీ ఆవేదన వ్యక్తం చేశారు. షమీకి ఆయన కోచ్ మద్దతు కూడా లభించింది. షమీ వ్యక్తిగతంగా తనకు తెలుసని, వివాహేతర సంబంధాలు పెట్టుకునేంత దిగజారుడు వ్యక్తిత్వం ఆయనకు లేదని కోచ్ వెనకేసుకొచ్చారు.  

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.