మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

టీచర్‌ను రేప్ చేస్తానని బెదిరించిన ఏడో తరగతి విద్యార్థి

Updated: 22-02-2018 07:50:22

గురుగ్రామ్: హరియాణాలోని ఓ స్కూలు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేప్ చేస్తామని ఒకరు హెచ్చరిస్తే, తొలుత డిన్నర్‌కెళ్లి ఆపై శృంగారంలో పాల్గొందామని మరో విద్యార్థి టీచర్‌ను ఆహ్వానించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ రెండు ఘటనలు హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఒకే పాఠశాలలో చోటుచేకున్నాయి. వారం క్రితం ఈ ఘటనలు జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉపాధ్యాయురాలిని హెచ్చరించిన విద్యార్థుల్లో ఒకరు ఏడో తరగతి చదువుతుండగా, మరొకరు ఎనిమిదో తరగతి విద్యార్థి. 
 
‘నిన్ను, నీ కూతురిని రేప్ చేస్తా’ అని ఏడో తరగతి కుర్రోడు ఫేస్‌బుక్‌లో తమ ఉపాధ్యాయురాలిని హెచ్చరించాడు. ‘షికారుకు వెళ్దాం, అటునుంచి అటే క్యాండిల్ లైట్ డిన్నర్ వెళ్లి ఆపై శృంగారంలో పాల్గొందాం’ అని ఎనిమిదో తరగతి విద్యార్థి టీచర్‌ను ఆహ్వానించాడు. దీంతో భయపడిన ఆ ఉపాధ్యాయురాలు కొన్ని రోజులుగా స్కూలుకు రావడం మానేశారు. విషయం బయటపడడంతో చర్చనీయాంశమైంది. జిల్లా చిన్నారుల సంక్షేమ కమిటీ చైర్మన్ శంకుంతల ధుల్ ఈ ఘటనపై స్పందిస్తూ టీచర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యార్థులకు నోటీసులు పంపించారు. రేప్ చేస్తామని బెదిరించిన విద్యార్థిని సస్పెండ్ చేసినట్టు స్కూలు యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.  

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.