మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

ముంబైలో నేడు శ్రీదేవి అంత్యక్రియలు

Updated: 27-02-2018 02:54:54

దుబాయ్: శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగించేందుకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతించింది. దీనికి సంబంధించి క్లియరెన్స్ లేఖ అందించారు. కుటుంబపభ్యులకు, రాయబార కార్యాలయ అధికారులకు క్లియరెన్స్ లేఖ అందింది. దీంతో శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ ప్రక్రియ చేపట్టాక శ్రీదేవి పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకువచ్చారు. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి అంబులెన్స్‌లో శ్రీదేవి నివాసానికి తరలించారు. అనేకమంది సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవి నివాసం వద్దకు చేరుకున్నారు. నివాళులర్పిస్తున్నారు. నేడు శ్రీదేవి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.