మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

బాలకృష్ణను పరామర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

Updated: 05-03-2018 05:59:39

అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అసెంబ్లీలో పరామర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల షూటింగ్‌లో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెలగపూడి వచ్చారు. ఆయన చేతికి ఉన్న కట్టుకు చూసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాలయ్య వద్దకు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను తిన్న దెబ్బల ముందు ఇదేమీ పెద్దది కాదని తనదైన శైలిలో పేర్కొన్నారు. ఇటువంటి వాటిని తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు. ఈనెల  31 నుంచి రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.