మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

జబర్దస్త్ ఫేం.. వినోద్ ఆత్మహత్యాయత్నం

Updated: 08-05-2017 08:14:48

కర్నూలు: జబర్దస్త్ ఫేం కామెడీ ఆర్టిస్ట్, స్త్రీల పాత్రలకు పెట్టింది పేరైన వినోద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తనకు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించడంతో తన చేతిని గాయపర్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాలోని సంజామల మండలం బొందలదిన్నెలోని చర్చిలో వినోద్‌కు బలవంతంగా వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే పెళ్లిని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న వినోద్ తన చేతిని గాయపర్చుకున్నాడు. విషయం పోలీసుకు తెలియడంతో వారొచ్చి వివాహాన్ని నిలిపివేశారు. వినోద్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.