మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న పవన్

Updated: 14-03-2018 10:01:06

జనసేన పార్టీకి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గుంటూరులో ఆ పార్టీ ఆవిర్భావ సభ జరుపుకుంటోంది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇందుకోసం జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి కార్యకర్తలకు అనుమతి ఉంది. మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. వేదికపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. ప్రత్యేక హోదాపై తెలుగు రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ లోపలా, బయటా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ ఏం చెప్పనున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రారంభం నుంచే పవన్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.