మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

జై సింహాపై కత్తి మహేశ్ రివ్యూ

Updated: 12-01-2018 10:28:14

హైదరాబాద్: కత్తి మహేశ్ జై సింహాను వదల్లేదు. సినిమాలో గతిలేని కథ ఉందని, గమనం లేని కథనం ఉందని కత్తి కామెంట్ చేశారు. నిరర్ధకమైన కథలోని అసంబద్దమైన పాత్రలో బాలయ్య నటించారని విమర్శించారు.
 
కత్తి మహేశ్ ట్వీట్ ఇదే!
 
80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా "జై సింహ". నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!
 
 
కత్తి ఇటీవల అజ్ఞాతవాసిని కూడా వదల్లేదు. 
 
అజ్ఞాతవాసిపై కత్తి మహేశ్ ట్వీట్ ఇదే... 
 
సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా. 
రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో).
 
మళ్లీ నేడు జై సింహానూ కత్తి మహేశ్ చీల్చిచెండాడాడు. 
 
నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ హీరోగా నటించిన జై సింహా  సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సి.కళ్యాణ్ సినిమాను నిర్మించారు. నయనతార హీరోయిన్‌గా నటించింది. సంగీతం చిరంతన్ భట్ అందించారు. అటు సినిమా స్పెషల్‌ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. 12 నుంచి 16 వరకు జై సింహా స్పెషల్ షోలకు అనుమతి మంజూరు చేసింది. అర్థరాత్రి 1 గంట నుండి ఉ.10 వరకు స్పెషల్ షోలు ప్రదర్శించుకోవచ్చు. 
 
 
 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.