మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

కోమటిరెడ్డి వెంకట రెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్...

Updated: 13-03-2018 10:30:39

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో హెడ్ ఫోన్ విసిరి శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయం చేసిన ఘటనలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు. మరో సభ్యుడు సంపత్ శాసన సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.  మొత్తం 11 మంది కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ మధుసూదనా చారి సస్పెండ్ చేశారు. జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీత, చిన్నారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డీకే అరుణ, సద్మవతి, రామ్మోహన్ రెడ్డి, సంపత్, వంశీచంద్ రెడ్డి, మాధవ్, భట్టి విక్రమార్కను సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ వీరిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అటు శాసనమండలిలోనూ కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ శాసన సభ్యత్వం రద్దు చేశారు. స్వామిగౌడ్ స్థానంలో డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్ మండలికి అధ్యక్షత వహించారు. నిర్ణయం కఠినమే కానీ తప్పదని సిఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ఇంత అసహనం పనికిరాదన్నారు. అరాచకశక్తుల పీచమణచడంలో ప్రభుత్వం వెనకడుగువేయదన్నారు. మరోవైపు తాను గవర్నర్‌ను టార్గెట్ చేస్తే హెడ్‌ఫోన్ స్వామిగౌడ్‌కు తగిలిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రైతులకు కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం ఉందని నిన్న కోమటిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం చెప్పేదొకటి,చేసేదొకటి అని, అందుకే తనకు ఆగ్రహం వచ్చిందని కోమటిరెడ్డి చెప్పారు.  

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.