మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

శ్రీదేవి మరణంపై క్షణక్షణం నిర్మాత ఏమన్నారంటే!

Updated: 27-02-2018 12:10:19

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటి శ్రీదేవి తో మా తొలి చిత్రం 'క్షణక్షణం' తీయడం, ఆ చిత్రానికి తొలిసారిగా ఆమె ఉత్తమ నటిగా నంది తో పాటూ ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకోవడంతో చాలా సంతోషించాం. ఆ చిత్ర నిర్మాణంలో తానొక పెద్ద స్టార్ హీరోయిన్ అనే ఫీలింగ్ లేకుండా చాలా సింపుల్ గా ఉంటూ ప్రతిక్షణం ఎంతో సహకరించేవారు. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు దూరమై, మానసికంగా డిప్రెస్ అయినా కూడా షెడ్యూల్స్ కి ఎలాంటి ఆటంకం లేకుండా సినిమా అనుకున్న టైమ్ కి పూర్తవడానికి ఎంతో తోడ్పడ్డారు. అలాంటి గొప్ప అంకితభావం ఉన్న నటి దూరమవడం చాలా దురదృష్టకరం. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబసభ్యులకు సంతాపం తెలియచేస్తున్నాను - డా|| కె.ఎల్.నారాయణ (శ్రీ దుర్గా ఆర్ట్స్)

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.