మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

మార్చి 25 నుంచి స్పెయిన్‌ షెడ్యూల్‌

Updated: 19-03-2018 10:36:48

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలో మహేష్‌ ట్రెడిషనల్‌ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. సర్‌ప్రైజింగ్‌గా మహేష్‌ మొదటిసారి పంచె కట్టుతో కనిపించడం సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వ్యూస్‌ సాధించింది. 
 
మార్చి 25 నుంచి స్పెయిన్‌ షెడ్యూల్‌ 
 
ఈ సందర్బంగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ''మన తెలుగు సంవత్సరాది పండగ కళ ఉట్టిపడే పంచె కట్టుతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశాం. ప్రేక్షకులకు, అభిమానులకు మహేష్‌ కొత్త లుక్‌ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఓ పాట రాజు సుందరం నేతృత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. భారీ టెంపుల్‌ సెట్‌లో 100 డాన్సర్లు, 1000 మందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్‌ లెవల్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈనెల 25 నుంచి స్పెయిన్‌లో షెడ్యూల్‌ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు. 
 
సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ల తోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ. 
Superstar Visual Feat In Traditional Attire
 
 
 
On the occasion of Ugadi, a new poster of Superstar Mahesh Babu’s Bharat Ane Nenu has been released. It has the Superstar wearing traditional wear of ‘Panche Kattu’. The poster has created sensation and gone viral instantly. Previously, the first teaser of the movie too went viral which made it the most liked teaser in Telugu Film Industry.
 
 
 
Speaking on the occasion producer, DVV Danaiah said,” On the occasion of our Telugu New Year festival Ugadi we have released a new poster of Superstar Mahesh Babu in a traditional Panche Kattu avatar. The fans and general audience have immensely loved the new look of Superstar in a Panche Kattu that is perfectly apt for the festive occasion. It is a visual treat for Ugadi”.
 
 
 
Bharat Ane Nenu New Schedule From March 25
 
A massive song is currently being canned by Choreographer Raju Rundaram in Hyderabad. More than 100 dancers and 1000 junior artists are participating in the song’s shoot happening in a huge Temple set on a grand level. 
 
After the completion of the song, the unit will move to Spain where a new schedule will begin from March 25. After the completion of the shoot, the unit will move into post-production and will be ready to release grandly worldwide on April 20
 
Superstar Mahesh Babu pairs up with Kiara Advani in the big budget commercial entertainer. Prakash Raj and Sarath Kumar play other important roles. Bharat Ane Nenu is produced on DVV Entertainments banner by DVV Danaiah. Smt. D Parvati presents the movie directed by Super director Koratala Siva. Devi Siri Prasad provides the music, Lyrics by Ramajogayya Satry where as the cinematography is handled by Thiru and Ravi K Chandran. Editing by Sreekar Prasad.

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.