మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

స్వాతి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏ క్షణంలోనైనా రక్తస్రావం జరగొచ్చు: వైద్యులు

Updated: 14-04-2017 01:03:37

హైదరాబాద్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఎన్నారై మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి హార్పిక్ తాగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. హార్పిక్ తాగిన కారణంగా ఆమెకు తీవ్ర ఇన్ఫెక్షన్ అయిందని, ఏ క్షణంలోనైనా ఆమెకు రక్తస్రావం అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. పది రోజుల క్రితం మదుకర్ రెడ్డి అమెరికా కాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. భార్య వేధింపుల వల్లే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన బంధువులు ఆరోపించారు. అయితే మధుకర్ ఉద్యోగ రీత్యా మానసిక ఒత్తిడికి గురయ్యేవాడని స్వాతి వెల్లడించారు. డిప్రెషన్‌కు చికిత్స పొందుతుండగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆమె రెండ్రోజుల క్రితం విలేకరులకు పాత ఆడియో రికార్డులు వినిపించింది. మధుకర్ ఆత్మహత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. భర్త అంత్యక్రియల సందర్భంగా భువనగిరిలో తనపై మధుకర్ బంధువులు దాడి చేశారని, తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఇంతలోనే ఆమె హార్పిక్ తాగి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తమ కుటుంబానికి మధుకర్ కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని స్వాతి తల్లిదండ్రులు కోరుతున్నారు.   

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.