మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

దొంగదెబ్బ తీసిన జైష్ ఎ మహ్మద్.. భారత ఆర్మీ క్యాంప్‌పై దాడి

Updated: 10-02-2018 10:28:51

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు దొంగదెబ్బ తీశారు. తెల్లవారుజామున సుంజావన్ ఆర్మీ క్యాంప్‌లో‌కి నలుగురు ఉగ్రవాదులు చొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు జేసీవోలు చనిపోయారు. 9 మందికి గాయాలయ్యాయి. భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ క్యాంప్‌లో కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలున్నాయని సమాచారం. కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న జవాన్లను సిఎం మెహబూబా ముఫ్తీ పరామర్శించారు.

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.