మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

నన్ను వాడుకుని వదిలేశారు: పవన్ కళ్యాణ్

Updated: 07-03-2018 01:02:02

హైదరాబాద్: తనపైకి ఐటీ అధికారులను పంపించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ, టీడీపీ కేసులకు భయపడుతున్నాయన్నారు. బాధ్యతగా ప్రవర్తించాల్సింది పోయి చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమం సాగాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ఉద్యమం చేస్తున్నాయని పవన్ చెప్పారు. హోదా ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయి నేతలంతా పార్టీలకు అతీతంగా కలిసిరావాలని సూచించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే అభివృద్ధి చేయలేదని ఏపీ సర్కార్ అంటోందని, ఇచ్చినవాటికి లెక్కలు చెప్పనందుకే నిధులు నిలిపామని కేంద్రం అంటోందని పవన్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకుంటే దక్షిణాది, ఉత్తరాది తేడాలొస్తాయని తాను మోదీతో అన్నానని పవన్ చెప్పారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో 20 ఏళ్లలో ద్రవిడ ఉద్యమం మళ్లీ వస్తుందని చెప్పానన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పడం మంచిదేనన్నారు. తప్పు చేశామనే భావన కాంగ్రెస్ పార్టీలో వచ్చిందనుకుంటానన్నారు. థర్డ్ ఫ్రంట్ అధికారం కోసమేనని అంతా అనుకుంటున్నారని, అయితే అది నిజం కాదని, స్వతంత్రంగా వ్యవహరించడానికి థర్డ్ ఫ్రంట్ అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. థర్డ్ ఫ్రంట్‌కు దక్షిణాది నుంచే కాకుండా జిగ్నేష్ లాంటి వ్యక్తులు కూడా మద్దతిస్తారని పవన్ తెలిపారు. 2014లో తనను వాడుకుని వదిలేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తన వైఖరేంటో చెబుతానన్నారు.  

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.