మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

రాజీనామాలు ఆమోదం.. నిరసనల్లో పాల్గొన్న టీడీపీ మంత్రులు

Updated: 09-03-2018 12:10:57

న్యూఢిల్లీ: నిన్న కేంద్రమంత్రి పదవులకు టీడీపీ మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి చేసిన రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో ఈ విషయంలో టీడీపీ చేస్తున్న నిరసనలు పతాక స్థాయికి చేరుకున్నట్లైంది. పార్లమెంట్ లోపలా, బయటా టీడీపీ ఎంపీల నిరసనలు ఊపందుకున్నాయి. పార్లమెంట్ ఆవరణలో సాగిన అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కూడా నేడు జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ కొయ్యదొరగా వేషం వేసి నిరసన తెలిపారు. టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తుండగా అటుగా వెళ్తున్న ఎంపీ జై రాం రమేశ్‌కు శివప్రసాద్ చేయి చూసి జోస్యం చెప్పారు. కొయ్యదొరలా కుర్రో కుర్రు అంటూ టీడీపీని వదులుకోవద్దని, ఏపీకి న్యాయం చేయాలని చెప్పారు.   ఏపీ విభజన బిల్లులోని హామీలను నెరవేర్చాలంటూ వైసీపీ ఎంపీలు కూడా ఆందోళనలు ఉధృతం చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.