మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

రేణు దేశాయ్ ఆవేదన.. సీన్‌లోకి ఎంటరైన కత్తి మహేశ్

Updated: 05-10-2017 12:34:54

రేణు దేశాయ్ బాధపడ్డారు. ఆమె ఆవేదనంతా ఫేస్‌బుక్ ద్వారా వెల్లడిస్తున్నారు. తనను నిన్నటిదాకా అభిమానించినవారే తాను ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత హేట్ యూ అంటూ సందేశాలు పెట్టడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకుని ఏడేళ్లపాటు ఒంటరితనం అనుభవించిన తాను ఇటీవలే ఓసారి అస్వస్థతతకు గురయ్యానని, తెలిసిన వాళ్లు తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆ టీవీ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ చెప్పారు. ఆ సమయంలో తన వాళ్లంటూ ఎవ్వరూ లేకుండా పోయారేననే ఒంటరితనం తనను ఆవరించిందని, అందుకే మరో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని యోచిస్తున్నట్లు రేణు దేశాయ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై రగడ మొదలైంది. రేణు దేశాయ్‌ను తాము ఇప్పటికీ పవన్ కళ్యాణ్ భార్యగానే భావిస్తున్నామని, వేరేవాళ్లను పెళ్లి చేసుకుంటే తాము ఇకపై రేణు దేశాయ్‌ను అభిమానించబోమని చెప్పారు. మరో అభిమాని అయితే మళ్లీ పెళ్లి చేసుకుంటే చచ్చినంత ఒట్టేనని మెసేజ్ పెట్టాడు. ఈ మెస్సేజ్‌లన్నింటినీ తన ఫేస్‌బుక్‌తో పెట్టిమరీ క్లాస్ పీకారు రేణు దేశాయ్. మహిళల ఆత్మ గౌరవం, స్వేచ్ఛ అంటూ మాట్లాడేవారు తాను గౌరవంగా రెండో పెళ్లి చేసుకుంటానంటే ఐ హేట్ యూ అంటూ సందేశాలు పెడతారా అని రేణు మండిపడ్డారు. ఆమె అంతటితో ఆగలేదు. ఇలాంటివారి పెంపకంలోనే తప్పుందని, మగాళ్లను తల్లులే సరైన పద్ధతిలో గౌరవించేలా నేర్పాలని రేణు సూచించారు. సాటి మహిళలను గౌరవంగా చూడటం నేర్పాలన్నారు. రేణు దేశాయ్ బాధను అర్ధం చేసుకున్న సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి సీన్‌లోకి ఎంటరయ్యారు. రేణు ఓ పక్క ఏడేళ్ల నుంచి బాధను అనుభవిస్తూ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు వచ్చిన ప్రాబ్లెం ఏంటని ఆయన తన ఫేస్‌బుక్ వేదికగా ప్రశ్నించారు. అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు, మహేశ్ కత్తికి కొంతకాలంగా పడటం లేదు. ఈ తరుణంలో రేణు దేశాయ్ రెండో పెళ్లి ప్రస్తావనతో నిద్ర కరవైన కొందరు సీన్‌లోకి మహేశ్ కత్తి ఎంటరవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకు సంబంధం లేకుండా, ఆయనకు చెప్పకుండానే రేణు దేశాయ్ రెండో పెళ్లి నిర్ణయాన్ని ఫేస్‌బుక్‌లో విమర్శిస్తూ పవన్ కళ్యాణ్‌కు చెడ్డపేరు తెస్తున్నారని పవన్ కళ్యాణ్ రియల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్ అంటూ  ఫేస్‌బుక్‌లో రేణు నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారు నిజంగా పవన్‌కు చెడ్డపేరు తెస్తున్నారని పవన్ రియల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. రేణుతో విడాకులు అయిపోయాయి కనుక రెండో పెళ్లి చేసుకుంటారా లేదా అనేది ఆమె వ్యక్తిగత విషయం. ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు వచ్చిన ఇబ్బందేంటని మహేశ్ కత్తి సహా అంతా ప్రశ్నిస్తున్నారు. పర్సనల్ లైఫ్ ఇష్యూని పబ్లిక్ ఇష్యూ చేసింది పీకే ఫ్యాన్స్ అని, అందుకే తాను మాట్లాడుతున్నానని మహేశ్ కత్తి ఫేస్‌బుక్ ద్వారా స్పందిస్తున్నారు. నిజమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవ్వరూ రేణు దేశాయ్ విషయంలో తలదూర్చరని పవన్ అభిమాన సంఘాలంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎదగాలనుకుంటోన్న పవన్ కళ్యాణ్‌కు ఫేక్ ఫ్యాన్స్ పేరిట జరుగుతున్న వివాదాలు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. పవన్ ఫ్యాన్స్ పేరు చెప్పుకుని రేణు దేశాయ్‌‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టవద్దని పవన్ రియల్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. 
 
రేణు దేశాయ్ ఫేస్‌బుక్‌లో ఆవేదనతో పెట్టిన సందేశాలివే.. 
1
 
*THIS POST IS NOT ABOUT ME PERSONALLY. It's my general thought about today's society and the mindset of men!

Ee post kevalam nannu uddhesinchindhi ani nenu anukovatledhu. This post is not about me personally. Kani ilanti comments chadhivinappudu 'Asalu manam elanti samajam lo, elanti mindset unna magavalla madhya bathukuthunnam?' ani chala andolanaga anipisthundhi. Oka vaipu, women equality, aadapillala shakti, rapes nunchi security, bhadratha gurinchi matladuthunnam. Inko vaipu, 7 yrs nenu ontarigaa undi, ippudu naaku oka life partner unte bagundu ani just express chesinandhuku, naku 'hate msgs' pamputhunnaru. Mana desam lo, oka magaadu emaina cheyachu, enni sarlaina pelli chesukovachu. Kani, oka ammai inko relation gurinchi alochinchadam kuda thappu! Thanu lifelong, thappu chesaananna feeling tho ontarigaa bathakaala??? I pray to God today, I sincerely pray to God today that Ee desam lo ammayila future bagundaalante, mahilale vaalla kodukulanu paddhatiga penchaali. Appudaina magavaalla mindset lo maarpu vasthundhemo...

 

2

In yesterdays post I have no where mentioned the word FAN of my ex husband... Media and some people are making this about me against Kalyan Garu's fans. Nenu chala clear gaa rasanu, ee post naa personal issue gurinche kadhu. This is a social thought I have shared as a citizen of this country. I request all of you to take the issue of women freedom, education, health seriously! Mee andaraki amma, akka, chelli unnaru...Idhi naa kosam kadhu, vallu kosam cheyyandi...give them a secure and protected feeling to study, work and have their own emotional freedom. And I sincerely request media channels to use their power of television reach positively instead of just creating drama and misunderstandings! I request all men to come together for your own family members who are women! Thank you 

 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.