మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       టాప్ న్యూస్

అదిరిపోయే ఫీచర్లతో భారత్‌లో లాంచ్ అయిన రెడ్‌మీ 5

Updated: 14-03-2018 10:11:23

న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షియోమీ తన తాజా స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5 భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. గత డిసెంబరులో  చైనాలో రెడ్‌మీ 5 ప్లస్‌తో కలిసి లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. గత నెలలో రెడ్‌మీ నోట్ 5ను లాంచ్ చేసిన షియోమీ రెడ్‌మీ 5 ప్రొను కూడా భారత్‌లో లాంచ్ చేసింది. ప్రస్తుతం రెడ్‌మీ 5 ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ ఇండియా, ఎంఐ డాట్‌ కామ్, ఎంఐ హోం స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు షియోమీ తెలిపింది. అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ పార్టనర్ స్టోర్లలో కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. 
 
రెడ్‌మీ 5 స్పెసిఫికేషన్లు: 5.7 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ చిప్‌సెట్, 12 మెగాపిక్సల్ రియర్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2జీబీ/16 జీబీ, 3జీబీ/32జీబీ, 4జీబీ/64జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీ పెంచుకునే వెసులుబాటు, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. వెనక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌తో రిలయన్స్ జియో ఫుట్‌‌బాల్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా తక్షణ క్యాష్ బ్యాక్ కింద రూ.2,200 వినియోగదారులకు లభిస్తుంది. 2జీబీ ర్యామ్ ధర రూ.7,999, 3జీబీ ర్యామ్ ధర రూ.8,999, రూ.4జీబీ ర్యామ్ ధర రూ.10,999.

షేర్ :

మరిన్ని టాప్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.