మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

యోగి నిర్ణయంతో ప్రభుత్వానికి 60 వేల కోట్ల రూపాయల ఆదాయం

Updated: 30-04-2017 10:20:03

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చిన్న నిర్ణయంతో ప్రభుత్వానికి 60 వేల కోట్ల రూపాయల ఆదాయం చేకూరేలా చేస్తోందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన బిజెపి-ఆర్ఎస్ఎస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మహనీయుల జయంతి, వర్ధంతుల సందర్భంగా సెలవులను రద్దు చేస్తూ యోగి ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం వల్ల ప్రభుత్వానికి 60 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని యోగి చెప్పారు. ఈ నిధులను సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని యోగి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు, యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా ఈ నిధులను ఉపయోగిస్తామని యోగి చెప్పారు. కేవలం నినాదాలు చేయడం వల్ల గోవులను రక్షించలేరని, గంగానది పరిశుభ్రం కాదని చెప్పారు. ఆచరణలోకి దిగినప్పుడే గోవులు రక్షింపబడతాయని, గంగానది ప్రక్షాళన సాధ్యమౌతుందని యోగి కార్యకర్తలకు సూచించారు. 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.