మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

టీడీపీతో పొత్తువల్ల బీజేపీ నష్టపోయింది: సోము వీర్రాజు

Updated: 28-02-2018 09:51:06

విజయవాడ: ఎందుకూ పనికిరాని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అదేదో గొప్ప పదవి ఇచ్చామని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భిక్ష వేశామని చెబుతున్నారని అన్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకోవడం వల్ల బీజేపీకే ఎక్కువ నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటే ఏడాదికి కేవలం రూ.3వేల కోట్లు మాత్రమే వచ్చే ప్రత్యేక హోదా ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో మూడుసార్లు పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులు నిర్వహించారని, 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్న చంద్రబాబు సర్కారు మోదీ ప్రభుత్వానికి అప్పు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.