మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

నేడు భారత్ ‌చేరుకోనున్న శ్రీదేవి భౌతికకాయం

Updated: 25-02-2018 10:07:56

దుబాయ్: మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి వెళ్లి గుండెపోటుతో మరణించిన ప్రముఖ నటి శ్రీదేవి(54) భౌతికకాయం నేడు భారత్ ‌చేరుకోనుంది. ఇప్పటికే శ్రీదేవి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తైంది. అయితే డెత్ సర్టిఫికెట్ విడుదల ఆలస్యమౌతోంది. దౌత్యకారణాలతో భౌతికకాయం తరలింపు ఆలస్యమౌతుంది. నివేదిక తర్వాతే దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయన్ని అప్పగించనున్నారు. రేపు భారత్ చేరుకోగానే తొలుత శ్రీదేవి ఇంటి నుంచి మెహబూబా స్టూడియోకు ఆమె పార్థీవదేహాన్ని తరలిస్తారు. అక్కడ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తారు. అనంతరం జూహూ శాంతాక్రాజ్ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దుబాయ్ ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో రాత్రి 11గంటలకు శ్రీదేవికి గుండెపోటు వచ్చింది. స్పృహ కోల్పోయిన ఆమెను వెంటనే రషీద్ హోటల్‌కు తరలించారు. ఈలోగానే ఆమె కన్నుమూసినట్లు భారత కాన్సులేట్ కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. శ్రీదేవి మరణవార్తతో సినీరంగంతో పాటు ఆమె అభిమానులు కూడా విషాద సాగరంలో మునిగిపోయారు.

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.