మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

శ్రీదేవి కోరిక మేరకు తెల్లపూలతో అంతిమయాత్ర

Updated: 28-02-2018 02:49:24

ముంబై: శ్రీదేవి చివరి కోరిక మేరకు ఆమె అంతిమయాత్రను నిర్వహిస్తున్నారు. అంతిమయాత్ర నిర్వహించే వాహనాన్ని మొత్తం తెల్లని పూలతో అలంకరించారు. వాహనం లోపల శ్రీదేవి చిత్రపటాన్ని పెట్టారు. దానిచుట్టూ  తెల్లని పూలను దండగా గుచ్చి అలంకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అంతిమయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే ఉత్తర, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ముంబై చేరుకున్నారు. ఈ ఉదయం శ్రీదేవి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఉంచారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అభిమానుల అశ్రునయనాల మధ్య కొద్దిసేపటి క్రితం అంతిమయాత్ర ప్రారంభమైంది. విల్లేపార్లే శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగుతుంది. అనంతరం నాలుగు గంటలకు అధికారిక లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతాయి.  
 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.