మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

శ్రీదేవిది హత్యే: సుబ్రహ్మణ్యస్వామి

Updated: 27-02-2018 11:10:12

చెన్నై: శ్రీదేవిది హత్యేనని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రకటన చేశారు. శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదని చెప్పారు. ఆమె శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఎలా వచ్చాయని చెప్పారని ప్రశ్నించారు. ఆమెచేత బలవంతంగా మద్యం తాగించి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సిసిటీవీ ఫుటేజీ మొత్తం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సినిమా తారలతో మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీంకున్న సంబంధాలపై దర్యాప్తు జరగాలని ఆయన కోరారు. తొలుత గుండెపోటుతో చనిపోయిందన్నారు. ఆ తర్వాత బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు నీటిలోపడి కన్నుమూసిందని చెప్పడంపై స్వామి అనుమానం వ్యక్తం చేశారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటన కోసం ఎదురుచూద్దామన్నారు. స్వామి ప్రకటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. మరోవైపు మొత్తం వ్యవహారంలో బోనీ కపూర్ చెప్పే విషయాలు అనుమానాస్పదంగా ఉండటంతో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 18 గంటలుగా ప్రశ్నిస్తోంది. ఇప్పటికే బోనీ పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు అందితేనే శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగిస్తామని చెప్పారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.