మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

రెండు సీట్లూ ఓసీలకే ఎందుకు కేటాయించారంటే!

Updated: 11-03-2018 08:29:13

హైదరాబాద్: రాజ్యసభకు రెండు సీట్లనూ ఓసీలకే కేటాయించారు టిడిపి అధినేత చంద్రబాబు. సిఎం రమేశ్, టీడీపీ లీగల్ సెల్ ఇంఛార్జ్ కనకమేడల రవీంద్రకుమార్ పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓసీ, ఎస్సీకి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే వీరందరినీ పక్కన పెట్టేశారు. సిఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పేర్లను ప్రకటించేశారు. 30 ఏళ్లుగా బీసీల పార్టీగా పేరున్న టీడీపీలో రెండు సీట్లనూ ఓసీలను కేటాయించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ అనివార్యతలు, భవిష్యత్ వ్యూహాల నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. అటు  వైసీపీ కూడా ఓసీకి కేటాయించింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేటాయించారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.