మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

వైసీపీ ఎంపీల ముందు తొడగొట్టి మీసం తిప్పిన జేసీ

Updated: 08-03-2018 11:41:48

న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీల ముందు తొడగొట్టి మీసం తిప్పారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మేం బయటకొచ్చాం, మీరూ రండంటూ వైసీపీ నేతలకు జేసీ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ప్రకటన చేశారు. 25 మంది ఎంపీలందరూ రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని, రాజీనామా చేసేందుకు సిద్ధమా అని జగన్ ప్రకటించారు. మార్చి 21న తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి బాబు మద్దతివ్వాలని జగన్ కోరారు. టీడీపీ మద్దతిస్తే రేపే అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్ చెప్పారు. జైట్లీ నిన్న చేసిన ప్రకటన పాతదే అని జగన్ అన్నారు. టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తే సరిపోదని ఎన్డీయే నుంచి టీడీపీ ఇంకా ఎందుకు వైదొలగడం లేదని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.