మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

మురళీమోహన్‌ను నిలదీసిన ప్రత్యేక హోదా సాధన సమితి కార్యకర్తలు

Updated: 07-03-2018 10:47:27

న్యూఢిల్లీ: టిడీపీ ఎంపీ మురళీ మోహన్‌ను ప్రత్యేక హోదా సాధన సమితి కార్యకర్తలు నిలదీశారు. పార్లమెంట్‌లో చిత్తశుద్ధితో పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రాజీనామా చేసి ఎన్డీయేనుంచి వైదొలగాలని సూచించారు. తమతో పాటు రోడ్డెక్కి ఆందోళన చేయాలని కోరారు. మరోవైపు ప్రత్యేక హోదా సమితి కార్యకర్తలపై మురళీమోహన్ మండిపడ్డారు. తాను చిత్తశుద్ధితోటే పోరాటం చేస్తున్నానని చెప్పారు. తానుకూడా సంతోషంగా లేనన్నారు. ఒక దశలో ఆయన తీవ్ర అసహనానికి గురై కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పేది వినాలంటూ గట్టిగా కేకలు వేశారు. కార్యకర్తలకు దండం పెట్టి తాను చెప్పేంది వినాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి కార్యకర్తల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది.     

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.