మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

హోదా వద్దని నేనెప్పుడూ చెప్పలేదు: చంద్రబాబు

Updated: 02-03-2018 04:42:45

అమరావతి: ప్రత్యేక హోదా వద్దని తానెప్పుడూ చెప్పలేదని ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వేరే రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్న తరుణంలో ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని చెప్పారు. హోదాకు అడ్డంకులున్నాయనడంతో ప్యాకేజీకి ఒప్పుకున్నట్లు చెప్పారు. నాలుగేళ్లైనా విభజన హామీలు అమలుకాలేదన్నారు. మరోవైపు ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ఇస్తామన్నందుకే ప్యాకేజ్ ఒప్పుకున్నామన్నారు. ప్యాకేజీ అమలు చేయనందుకే హోదా అడుగుతున్నామన్నారు. అవసరమైతే కోర్టుకైనా వెళ్తామన్నారు. మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర వైఖరిలో మార్పు వచ్చేవరకూ పార్లమెంట్‌ను స్థంభింపచేయాలని నిర్ణయించారు. ఏపీకి అన్యాయంపై కేంద్రాన్ని పార్లమెంట్‌లో నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.