మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

బీజేపీకి షాకిచ్చిన టీడీపీ

Updated: 07-03-2018 12:20:25

అమరావతి: టీడీపీ బీజేపీకి షాకిచ్చింది. మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్యను టీడీపీలోకి చేర్చుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్బయ్య టిడీపి అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సుబ్బయతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా టీడీపీలో చేరారు. మరింత మంది బీజేపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీతో పొత్తు వద్దనుకుంటోన్న తరుణంలో సుమారు నాలుగేళ్ల స్నేహం తర్వాత టీడీపీ తొలిసారిగా బీజేపీ నేతలను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. తద్వారా బీజేపీతో రాజకీయ యుద్ధానికి సిద్ధమని చంద్రబాబు సంకేతాలిచ్చినట్లైంది.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.