మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Updated: 20-02-2018 04:26:44

అమరావతి: ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం నేడు జరగనుంది. 23న ఢిల్లీకి రావాలని ఏపీ చీఫ్ సెక్రటరీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. దీంతో నేడు సమావేశమై అన్ని విషయాలపై చర్చించి కేంద్రంతో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కేంద్రానికి పూర్తి వివరాలు నివేదించనున్నారు. ప్యాకేజీ, రైల్వే జోన్, పోలవరం, కేంద్రం ఇప్పటివరకూ కేటాయించిన నిధులు తదితర అన్ని అంశాలపై చర్చించనున్నారు. అన్ని వివరాలనూ కేంద్రానికి అందించనున్నారు. మరోవైపు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నవారినందరినీ కలుపుకుపోవాలని టిడిపి అధినేత యోచిస్తున్నారు. పార్టీలతో పాటు పార్టీలకు అతీతంగా మాట్లాడేవారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని యోచిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరి మద్దతూ కూడగట్టాలనేది చంద్రబాబు వ్యూహం. ఇప్పటికే అఖిల సంఘాల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రానికి మెజార్టీ ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే ప్రయోజనం ఉండదని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చివరి అస్త్రంగానే అవిశ్వాస తీర్మానం పెట్టాలని టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చెప్పారని సమాచారం.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.