మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

అఖిల్, శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్?

Updated: 22-02-2017 05:22:35

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కడినేని నాగార్జున కుమారుడు, యంగ్ హీరో అఖిల్, శ్రియాభూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయినట్టు టాలీవుడ్‌లో వార్త గుప్పుమంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. రోజులు కూడా గడవకముందే పెళ్లి ఎందుకు రద్దు అయిందన్న విషయంలో స్పష్టత లేకున్నా పెళ్లి క్యాన్సిల్ అయిందన్న పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. అఖిల్, శ్రియా భూపాల్ మధ్య భేదాభిప్రాయాలే పెళ్లి క్యాన్సిల్ కావడం కారణమని చెబుతున్నారు. మనస్పర్థల నేపథ్యంలో ఇరు కుటుంబాల వారు అఖిల్, శ్రియలతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో మరో మార్గం లేక పెళ్లి క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి వీరి పెళ్లి మేలో జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. పెళ్లి కోసం హోటళ్లు, రిసార్టులు కూడా బుక్ చేశారు. ఇప్పుడు ఈ వార్త తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ నిర్ఘాంతపోయారు. అయితే ఈ విషయంలో ఇరుకుటుంబాల నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.  

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.