మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

రాజీనామాలు చేసిన ఏపీ బిజేపీ మంత్రులు

Updated: 08-03-2018 10:43:53

అమరావతి: ఏపీ బీజేపీ మంత్రులు మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. సిఎం చంద్రబాబుతో ఆయన చాంబర్‌లో కలిసి రాజీనామాలు సమర్పించారు. మూడు నిమిషాల్లో మాణిక్యాల రావు సిఎం చాంబర్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం అసెంబ్లీలో కామినేని మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పారు. చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలందరూ తనను గెలిపించారని చెప్పారు. వెంకయ్యనాయడు వల్లే తాను బిజేపీలోకి రావడం, మంత్రి కావడం జరిగిందన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ తాను అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తనకు సహకరించారని  ఆ తర్వాత మాణిక్యాల రావు అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితోటే తాను టెక్నాలజీ విషయంలో శ్రద్ధ కనపరచగలిగానన్నారు. దేవాదాయశాఖలో మార్పులకు యత్నించానని చెప్పారు. పుష్కరాలు ఘనంగా నిర్వహించగలిగానన్నారు. ఇందుకు తనకు సహకరించిన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రివర్గ సహచరులకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. విడిపోవడం వల్లే ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీకి అండగా ఉన్న బిజేపీని, మోదీని దోషిగా చూడటం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మోదీని, బీజేపీని సరిగా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నానని మాణిక్యాల రావు చెప్పారు. తర్వాత మాట్లాడిన ఏపీ సిఎం చంద్రబాబు ఇద్దరు బిజెపి మంత్రుల పనితీరును ప్రశంసించారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.