మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

శిల్పా చక్రపాణి రెడ్డికి బిగ్ షాక్.. వైసీపీ అధినేత ట్విస్ట్‌..

Updated: 03-08-2017 02:18:05

నంద్యాల: తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు వెళ్లిన శిల్పా చక్రపాణి రెడ్డికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని కండీషన్ పెట్టారు. దీంతో చక్రపాణిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. వైసీపీలో చేరే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి కోరిక మేరకు వైసీపీలో చేరేందుకు సిద్ధమైన తరుణంలో టిడిపి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ కోరడం శిల్పా చక్రపాణి రెడ్డికి మింగుడు పడని విషయంగా తయారైంది. టిడిపిలో తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని శిల్పా చక్రపాణి రెడ్డి ఇటీవలే వ్యాఖ్యానించారు. ఇంతలో ఇలా జరగడంతో ఆయన షాక్ తిన్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. టిడిపి తరపున భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీలో ఉండగా వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగారు. వాస్తవానికి టిడిపి నుంచి టికెట్ విషయంపై ఏమీ తేలకపోవడంతో ఆయన టిడిపికి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. తాను స్వయంగా వెళ్లి తన సోదరుడు చక్రపాణి రెడ్డిని కూడా వైసీపీలోకి రావాలని కోరారు. అయితే వైసీపీ అధినేత టిడిపి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తేనే వైసీపీలోకి రావాలని కండీషన్ పెట్టడంతో చక్రపాణి రెడ్డికి దిక్కు తోచడం లేదు. ఎమ్మెల్సీ పదవిని అయిష్టంగానైనా వదులుకునేందుకే ఆయన సిద్ధపడ్డారని సమాచారం. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడిగా మారే అవకాశాలున్నాయనే అనుమానంతో చక్రపాణి రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని తెలిసింది. 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.