మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

పరి సినిమా చూసి భయపడ్డా: విరాట్ కోహ్లీ

Updated: 02-03-2018 05:45:07

అనుష్కా శర్మ నటించిన హారర్ సినిమా పరిని ఆమె భర్త విరాట్ కోహ్లీ చూశారు. అనుష్క తల్లిదండ్రులతో కలిసి కోహ్లీ ఈ సినిమా చూశారు. కొన్ని దృశ్యాలు చూసి తాను భయపడ్డానని కోహ్లీ చెప్పాడు. అనుష్క అద్భుతంగా నటించిందని, అనుష్క తన భార్య అయినందుకు గర్వంగా ఉందని చెప్పాడు. పరి సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. పూర్తి హారర్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో పరంబ్రాతా చటర్జీ, రజత్ కపూర్, రితాబరి చక్రవర్తి ప్రధానపాత్రలు పోషించారు. సినిమాకు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.