మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

విదేశాల్లో కోహ్లీ సరికొత్త రికార్డు!

Updated: 07-02-2018 09:08:13

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న వన్డేలో అజేయంగా 160 పరుగలు చేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ విదేశాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. కపిల్ దేవ్ తర్వాత విదేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 1983లో టర్న్‌బ్రిడ్జ్ వెల్స్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ అజేయంగా 175 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు కోహ్లీ అజేయంగా 160 పరుగులు చేశాడు. 
 
ఇక, దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లలో గంగూలీ (127), సచిన్ టెండూల్కర్ (146), సచిన్ టెండూల్కర్ (152) ఉన్నారు. ఇప్పుడు కోహ్లీ 160 పరుగులు చేశాడు. 

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.