మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

టిడిపిలోకి మారే వార్తలపై స్పందించిన శ్రీకాంత్ రెడ్డి..

Updated: 30-08-2017 01:25:08

హైదరాబాద్: టిడిపిలోకి మారుతున్నారన్న వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని, తాను జగన్ నేతృత్వంలో ఫ్యాన్ కిందనే ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు నంద్యాల ఎన్నికల్లో టిడిపి విజయాన్ని వైసీపీ అధికార ప్రతినిథి పార్థ సారథి ఎద్దేవా చేశారు. 
 
పార్థ సారథి ఇంకా ఏమన్నారంటే 
 
వైసీపీని చూస్తే ఎంత బయపడిపోయారో నంద్యాల ఫలితాలు చూస్తే అర్ధం అవుతుంది.
 
నంద్యాల్లో గెలుపు కోసం టీడీపీ నేతలు 200 కోట్లు ఖర్చు చేశారు
 
వైసీపీ పుట్టిన తర్వాత 18 ఉప ఎన్నికలు జరిగితే అన్ని ఎన్నికల్లో ఓడిపోవడమే గాక డిపాజిట్ కూడా పోగొట్టుకుంది.
 
నెల్లూరు ఎంపీ ఉప ఎన్నికల్లో, కడపలో వైసీపీకి కనీవినీ ఎరుగని ఓట్లు వచ్చాయి. పులివెందుల ఉప ఎన్నికల్లో 11239 ఓట్లు టీడీపీ అభ్యర్థికి వచ్చాయి.
 
నంద్యాల మోడల్ ఏంటి? ఇళ్లు, పెన్షన్లు, కేసులు పెడతాం, రేషన్ రద్దు చేస్తాం, 4, 5 వేలు ఓటుకు ఖర్చు చేయడమేనా మెడల్ నంద్యాల.
 
175కు 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకోవడమేనా మీ మెడల్.
 
ప్రజలను, పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరింపులకు గురి చేయడమేనా మోడల్ నంద్యాల.
 
ఒక పక్క కత్తి పెట్టి మరోపక్క 6, 7 వేలు పెట్టడమేనా.. టీడీపీ కోరుకునేది?
 
విజయానికి మోడల్ కాదు, 2019 ఎన్నికల్లో ఈ మోడలే టీడీపీని ఇంటికి పంపిస్తుంది.
 
వైసీపీకి ఓట్లు వేసిన 70 వేల మంది ఓటర్లకు హాట్సాఫ్. నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే చూస్తూ వురుకోము.
 
 ఉప ఎన్నికలంటే భయం కాబట్టే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదు.

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.