మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

పవన్‌పై జగన్, రోజా సెటైర్లు

Updated: 19-02-2018 09:18:28

తిరుమల: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా పరోక్ష విమర్శలు గుప్పించారు. హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్ ఎందుకు వెనక్కు తగ్గారని రోజా ప్రశ్నించారు. పవన్ సూచనమేరకు అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని రోజా తెలిపారు. టీడీపీతో పాటు 50మంది ఎంపీల మద్దతుకు పవన్ సహకరిస్తారా అని రోజా ప్రశ్నించారు. నాలుగేళ్లు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు జేఏసీ అంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాకుంటే ఏపీ అన్నిరకాలుగా వెనకబడిపోతుందని పార్టీలకతీతంగా ప్రజలంతా ఏకమై పోరాడితేనే హోదా సాధ్యమౌతుందని రోజా చెప్పారు. ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచీ పోరాడుతున్నది జగన్ ఒక్కడేనన్నారు. జేఎఫ్‌సీ పేరుతో జగన్‌పై పవన్ బురదజల్లేలా మాట్లాడటం సరికాదని రోజా చెప్పారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉందని, టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలకు దమ్ముందా అని రోజా ప్రశ్నించారు. నిన్న జగన్ కూడా ప్రజాసంకల్ప యాత్రలో మాట్లాడుతూ టిడిపి కనుక అవిశ్వాస తీర్మానం పెడితే వైసీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అనే చంద్రబాబు పార్ట్‌నర్ జేఎఫ్‌సీ పేరుతో కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. పవన్ సూచనమేరకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ మద్దతిస్తుందా అని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.    

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.