మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

బిజెపి‍ టీడీపీ మద్య లెక్కల వివాదం

Updated: 14-03-2018 11:41:18

అమరావతి: 2014 నుంచి కేంద్రం నుంచి ఇప్పటి వరకూ 2, 17, 198 కోట్ల రూపాయలు వచ్చాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఏపీ ఆర్ధిక మంత్రి యనమల అసెంబ్లీలో లెక్కలు సమర్పించారు. బీజేపీ నేత విష్ణు కుమార్ రాజుపై టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన లెక్కలతో పాటు రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన లెక్కలు కూడా చెప్పాలని కోరారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై కేంద్రం వివక్ష చూపిస్తోందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్రం కేంద్రానికి 49 వేల కోట్ల రూపాయలిచ్చిందన్నారు. అయితే బుచ్చయ్య చౌదరి వాదనను ఖండిస్తూ విష్ణుకుమార్ రాజు కేంద్రం ఇచ్చిన లెక్కలు అధికారికంగా చూపిస్తూనే అన్యాయం చేసిందని ఎలా అంటారని ప్రశ్నించారు. విష్ణుకుమార్ రాజు వైసీపీ నేతలా వ్యవహరిస్తున్నారని యనమల ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే తమకూ ఇచ్చారని, ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని యనమల చెప్పారు.  
 
కేంద్రం ఇచ్చిన నిధులివేనని తెలిపిన ఏపీ ప్రభుత్వం
 
కేంద్ర పన్నులలో వాటా కింద 1,01,520 కోట్లు 
జీఎస్టీ కింద 5410 కోట్లు 
13 వ ఆర్దిక సంఘం, 14 వ ఆర్దిక సంఘం గ్రాంట్లు 29928 కోట్లు 
స్థానిక సంస్థలకు 10263 కోట్లు 
రెవెన్యూ లోటు గ్రాంట్. 15969 కోట్లు 
అమరావతి రాజధాని గ్రాంట్లు 2000 కోట్లు
విజయవాడలో వరద నీటి మురుగుపారుదల పధకం. 920 కోట్లు 
గుంటూరులో సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల పధకం 1080 కోట్లు 
వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు 1400 కోట్లు 
గోదావరి పుష్కరాలకు ఇచ్చినవి 200 కోట్లు 
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి. 5595 కోట్లు
 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.