మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

విషాదంలో వైసీపీ శ్రేణులు.. రోడ్డు ప్రమాదంలో సీనియర్ నేత దుర్మరణం

Updated: 24-09-2017 06:36:24

హైదరాబాద్: వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. వైసీపీ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మీర్జా ఆజం అలీ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. మీర్జా ఆజం అలీ భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం జరిపించారు. మీర్జా ఆజం అలీ ఆకస్మిక మరణంపై వైసీపీ నేతలు షాక్‌కు గురయ్యారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నేతను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు.

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.