మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

రికార్డులు సృష్టించిన భూమా అఖిల ప్రియ

Updated: 02-04-2017 09:48:41

కర్నూలు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(28) రికార్డులు సృష్టించారు. నేడు బర్త్‌డే జరుపుకుంటోన్న ఆమె మంత్రిగా ప్రమాణం చేశారు.  తద్వారా కర్నూలు జిల్లా నుంచి తొలి మహిళా మంత్రి అయ్యారు. అలాగే ఏపీ కేబినెట్‌లో అత్యంత పిన్నవయస్కురాలు కూడా ఆమెనే. తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో 25 ఏళ్లకే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇటీవల తండ్రితో కలిసి టీడీపీలో చేరారు. ఇటీవల తండ్రి భూమా నాగిరెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. కాగా, కర్నూలు జిల్లా నుంచి  సుబ్బరత్నమ్మ, భూమా శోభానాగిరెడ్డి, పాటిల్‌ నీరజారెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టినా మంత్రి పదవి మాత్రం అఖిలప్రియకు దక్కింది. తద్వారా జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.