మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

బాబును కలిశాక భావోద్వేగానికి గురైన ధూళిపాళ్ల

Updated: 01-04-2017 03:19:20

విజయవాడ: ఏపీ కేబినెట్‌ విస్తరణలో చోటు సంపాదించాలని యత్నిస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర ఏపీ సిఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిశాక దూళిపాళ్ల భావోద్వేగానికి గురయ్యారు. పార్టీకి, అధిష్టానికి వ్యతిరేకంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని చెప్పారు. కన్నాను ఎదిరించి పార్టీకోసం పోరాడానని, పదేళ్లు పార్టీకోసం సేవ చేశానని చెప్పారు. తనకు మంత్రిపదవి ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. అంతకుముందే బాబు యనమలతో వేరుగా భేటీ అయ్యారు. మరోవైపు బాబు నివాసానికి జ్యోతుల నెహ్రూ చేరుకున్నారు. చంద్రబాబును ఇప్పటికే కలిసిన వారిలో బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, కళావెంకట్రావు, యనమల, జెసి దివాకర్ రెడ్డి, పయ్యావుల తదితరులున్నారు. 

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.