మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంలో నటుడు రాజశేఖర్.. కారును గుద్దేసిన హీరో

Updated: 09-10-2017 09:31:11

హైదరాబాద్: సినీ నటుడు రాజశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్ వద్ద పి. వి. ఎక్స్‌ప్రెస్‌పై ఆగి ఉన్న ఫార్చునర్ కారును రాజశేఖర్ తన కారుతో ఢీ కొట్టారు. దీంతో ఫార్చునర్ కార్ యజమాని బిల్డర్ రాం రెడ్డికి, రాజశేఖర్ మధ్య వాగ్వాదం జరిగింది. రాజశేఖర్‌ను శిక్షించాల్సిందేనని, ఆయన మద్యం తాగి కారు నడుపుతూ తన కారును ఢీ కొట్టారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయి ఉంటే ఎలా అని రాం రెడ్డి నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి భార్య నటి జీవిత ఘటనా స్థలానికి చేరుకుని రాజీ కుదిర్చారు. పోలీసులు రాజశేఖర్‌కు బ్రీత్ అనలైజింగ్ పరీక్షలు నిర్వహించారు. అయితే 28 శాతం మాత్రమే రావడంతో రాజశేఖర్‌పై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఘటన అర్ధరాత్రి కలకలం రేపింది. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.