మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

మంత్రిపదవి దక్కకపోవడంతో మూడో కన్ను తెరిచిన జలీల్ ఖాన్

Updated: 02-04-2017 02:21:22

అమరావతి: ఏపీ కేబినెట్ విస్తరణలో తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో టిడిపి ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మూడో కన్ను తెరిచారు. మైనార్టీల్లో తీవ్ర అలజడి నెలకొందని చెప్పారు. మైనార్టీ సంఘాలు, తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యాక తన నిరసనను వ్యక్తం చేశారు. సిఎం తలచుకుంటే మంత్రి పదవి పెద్ద విషయమే కాదన్నారు. 12 శాతం ఉన్న మైనార్టీలను విస్మరించడం దారుణమని జలీల్‌ఖాన్ మండిపడ్డారు. భవిష్యత్ కార్యాచరణ ఆయన త్వరలో ప్రకటిస్తారని భావిస్తున్నారు. బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జలీల్‌ఖాన్‌కు మేలు చేయడం కన్నా కీడు ఎక్కువ చేసింది. మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఇదేనని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.  

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.