మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

ఒక్కగానొక్క కుమారుడు దూరమవడంతో శోకసంద్రంలో నారాయణ కుటుంబం

Updated: 10-05-2017 11:13:50

హైదరాబాద్: ఒక్కగానొక్క కుమారుడు నిషిత్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మంత్రి నారాయణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్న నారాయణ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. విదేశాల్లో చదువుకున్న నిషిత్...  నారాయణ విద్యాసంస్థల వ్యాపారంలో వారసుడౌతాడని అంతా భావిస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు నారాయణ లండన్ నుంచి బయలుదేరారు. నిషిత్ మృతదేహానికి నెల్లూరులో రేపు అంత్యక్రియలు జరుగుతాయి. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.