మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

మహేశ్ వెన్నులో కత్తి దించిన ఎన్టీయార్

Updated: 26-09-2017 12:52:46

ఎన్టీయార్ 'జై లవకుశ' చిత్రం ఇటీవల విడుదలైంది. దానికి సంబంధించిన జయోత్సవం కూడా జరిగింది. ఈ వేడుకలో ఎన్టీయార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విడుదలయ్యే సినిమా ఎమర్జెన్సీ వార్డ్ లో ఉండే పేషెంట్ అని, తామంతా అతని బంధువులమని, ప్రేక్షకులు వైద్యం చేసే డాక్టర్లు అని అన్నారు. అంతవరకూ బాగానే ఉంది.... అయితే సినిమాను విశ్లేషించే రివ్యూవర్స్ ను మాత్రం ఎన్టీయార్ దారిన పోయే దానయ్యలతో పోల్చారు. హాస్పిటల్ లో చావు బతుకుల మధ్యలో ఉన్న పేషెంట్ బాగు కోరకుండా వారంతా... అబ్బే లాభం లేదు... పోతాడు అని చెప్పడం సమంజసం కాదని వాపోయాడు. 


ఇటీవలే ఎన్టీయార్ బిగ్ బాస్ షో ను పూర్తి చేసుకుని వచ్చాడు. అందులోకి చిత్రసమీక్షకుడి హోదాలో మహేశ్ కత్తి వెళ్ళాడు. నిజానికి మహేశ్ కత్తికి ఏ సినిమానైనా నిర్మొహమాటంగా ఏకి పారేస్తాడనే పేరుంది. ఓ ప్రముఖ ఛానెల్ లో అతను చేసే విశ్లేషణను చూసి... మండిపడే నిర్మాతలు, కోపగించుకునే హీరోల అభిమానులు చాలామందే ఉన్నారు. సో...  మహేశ్ కత్తి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు విడుదలైన సినిమాలు ఆయన విమర్శలను గురి కాలేదు. ఆయన బిగ్ బాస్ షో నుండీ ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే మళ్ళీ రివ్యూలు మొదలు పెట్టారు. సినిమాలను చీల్చి చెండాలటం ప్రారంభించారు. ఎన్టీయార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ హౌస్ నుండీ బయటకు వచ్చిన మహేశ్ కత్తి 'జై లవ కుశ' మూవీని ఎలా విశ్లేషిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కానీ ఊహించని విధంగా ఆయన బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలేకు వెళ్ళడంతో... 'జై లవకుశ' ను సమీక్షించే అవకాశం రాలేదు. ఆ రకంగా 'జై లవకుశ' సినిమా బతికి పోయినట్టే!


ఇప్పుడు విషయం ఏమంటే... ఎన్టీయార్ దారిన పోయే దానయ్యలు అంటూ చేసిన వ్యాఖ్య మహేశ్ కత్తికీ  వర్తిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండగా మహేశ్ కత్తి చేసే సినీ విశ్లేషణల గురించి బాగా పొగిడిన ఎన్టీయార్... ఇప్పుడు ఆ షో పూర్తి కాగానే మహేశ్ వెన్నులో ఇలాంటి సంచలన వ్యాఖ్యల కత్తిని గట్టిగానే దించారు. అంతేకాదు... ఓవర్ ఆల్ గా చిత్ర సమీక్షకులపై చిన్న చూపు చూపారు. మరి పాపులర్ ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి ... ఎన్టీయార్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి!

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.