మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

మంత్రివర్గ విస్తరణపై మోదీ, అమిత్‌ షాలకు పురందేశ్వరి సంచలన లేఖ

Updated: 04-04-2017 01:25:40

అమరావతి: ఏపీ కేబినెట్‌లో వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడంపై బిజెపి నాయకురాలు పురందేశ్వరి ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు. ఏపీ సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి కూడా భాగస్వామిగా ఉందని, ఇలాంటి తరుణంలో ఫిరాయింపులను ఏ మాత్రం ప్రోత్సహించరాదని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టం అపహాస్యం పాలవుతోందని చెప్పారు. ఫిరాయింపులను అరికట్టేందుకు కఠినచట్టం తీసుకురావాలన్నారు. ఫిరాయింపులను ప్రోత్పహిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని హెచ్చరించారు. పురందేశ్వరి లేఖ ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. రెండు రోజులు మౌనంగా ఉండి తాజాగా లేఖాస్త్రం సంధించడంతో దుమారం రేగింది. ఫిరాయింపులను బిజెపి వ్యతిరేకిస్తుందని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఫిరాయింపులపై వైసీపీ ఢిల్లీ స్థాయి ఆందోళనకు సిద్ధమౌతున్న తరుణంలో పురందేశ్వరి లేఖ బాబు సర్కారుకు కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.